మళ్ళీ కరోనా వైరస్ కోరల్లో ఆస్ట్రేలియా.. మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్‌

| Edited By: Pardhasaradhi Peri

Jul 11, 2020 | 12:42 PM

ఆస్ట్రేలియాలో మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తోంది.సిడ్నీ తరువాత రెండో అతిపెద్ద నగరమైన మెల్ బోర్న్ లో లాక్ డౌన్ విధించారు. దీంతో సుమారు ఐదు లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావలసిన పరిస్థితి..

మళ్ళీ కరోనా వైరస్ కోరల్లో ఆస్ట్రేలియా.. మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్‌
Follow us on

ఆస్ట్రేలియాలో మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తోంది.సిడ్నీ తరువాత రెండో అతిపెద్ద నగరమైన మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో సుమారు ఐదు లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడింది. మరో ఆరు వారాల వరకు నిత్యావసరాల కోసం వీరిలో చాలామంది బయటకు రాక తప్పడంలేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు జనాలను నియంత్రించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోతోంది. తాము  ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను దాటుకుని వస్తున్న వందలాదిమందిని అదుపు చేయలేకపోతున్నారు. ఈ నగరంలో ఈ మధ్యే తెరచిన బార్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, జిమ్ లను మళ్ళీమూసివేశారు. విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ మధ్య సరిహద్దులను కూడా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. మెల్‌బోర్న్‌లో ఒక్క బుధవారం రోజే 134, అంతకు ముందు రోజున 191 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

క్యాన్ బెరాలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ వ్యాప్తి కావచ్ఛునని భయపడుతున్నారు. మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి విమానంలో వచ్చిన సుమారు 50 మంది ప్రయాణికులకు ఎలాంటి కోవిడ్-19 టెస్టులు చేయకుండానే ప్రభుత్వం అనుమతించడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆస్ట్రేలియాలో తొమ్మిది వేల కరోనా కేసులు నమోదయ్యాయి.