లాక్‌డౌన్ తర్వాత కూడా ఆన్‌లైన్‌దే హవా

| Edited By:

Apr 26, 2020 | 3:01 PM

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటున్నారు. అత్యవసర అవసరాలకు మినహా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలంతా ఆన్‌లైన్ షాపింగే చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ అనంతరం కూడా ఈ అధిక శాతం వినియోగదారులు..

లాక్‌డౌన్ తర్వాత కూడా ఆన్‌లైన్‌దే హవా
Follow us on

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటున్నారు. అత్యవసర అవసరాలకు మినహా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలంతా ఆన్‌లైన్ షాపింగే చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ అనంతరం కూడా అధిక శాతం వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపుతారని ఓ సర్వే అధ్యయనంలో తెలింది. రాబోయే ఆరు నుంచి 9 నెలల్లో 46 నుంచి 64 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తారని ఆ సర్వే ద్వారా తెలిసింది.

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న కారణంగా ప్రజలంతా ఒక్కసారిగా ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని కాప్ జెమినీ అనే ఐటీ సంస్థ ఓ నివేదిక ప్రచురించింది. ఏప్రిల్ నెల తొలి రెండు వారాల్లో ఆ సంస్థ సర్వే చేసినట్లు తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత 78 శాతం మంది ప్రజలు ఆన్‌లైన్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారట. ఆన్‌లైన్ షాపింగ్‌లో అవసరమైనప్పుడు ఏ సమయంలోనైనా వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చు. దీని కారణంగా 74 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. అలాగే 89 శాతం మంది ఆరోగ్య భద్రత, పరిశుభ్రతపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారని కాప్ జెమినీ సంస్థ పేర్కొంది.

Read More: 

తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!