చెన్నై ఐఐటీలో కలకలం…. మళ్లీ లాక్‌డౌన్ నిబంధనలు అమలులోకి … కరోనా బారిన పడిన విద్యార్థులెందరంటే…

| Edited By:

Dec 14, 2020 | 10:17 AM

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. ఇప్పటికే ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా చెన్నై ఐఐటీలో కరోనా విజృంభించింది.

చెన్నై ఐఐటీలో కలకలం.... మళ్లీ లాక్‌డౌన్ నిబంధనలు అమలులోకి ... కరోనా బారిన పడిన విద్యార్థులెందరంటే...
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గడం లేదు. ఇప్పటికే ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా చెన్నై ఐఐటీలో కరోనా విజృంభించింది. 71 మందికి కరోనా బారినపడినట్లు ఐఐటీ అధికారులు తెలిపారు. అందులో 66 మంది విద్యార్థులున్నారు. కేవలం ఒక్కరోజులోనే 32 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని క్యాంపస్ అధికారులు తెలిపారు. యూనివర్సిటీలో 774 మంది విద్యార్థులున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం క్యాంపస్‌లో మళ్లీ లాక్‌డౌన్ నిబంధనలను అమలులోకి తెచ్చామని, అన్ని డిపార్ట్‌మెంట్లను మూసివేస్తున్నట్లు తెలిపారు.