కరోనా అప్డేట్: దేశంలో 18601 పాజిటివ్ కేసులు, 590 మరణాలు..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య 18601 చేరింది. మొత్తం మరణాల సంఖ్య 590కు చేరుకుందని కేంద్రం ప్రకటించింది. కరోనా సంబంధిత మరణాలు మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. Also Read: ముస్లిం సోదరులకు పాక్ ప్రధాని గుడ్ న్యూస్.. ప్రార్ధనలకు గ్రీన్ సిగ్నల్.. ఈ రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 232 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,553 […]

కరోనా అప్డేట్: దేశంలో 18601 పాజిటివ్ కేసులు, 590 మరణాలు..

Updated on: Apr 21, 2020 | 9:46 AM

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య 18601 చేరింది. మొత్తం మరణాల సంఖ్య 590కు చేరుకుందని కేంద్రం ప్రకటించింది. కరోనా సంబంధిత మరణాలు మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి.

Also Read: ముస్లిం సోదరులకు పాక్ ప్రధాని గుడ్ న్యూస్.. ప్రార్ధనలకు గ్రీన్ సిగ్నల్..

ఈ రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 232 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,553 పాజిటివ్ కేసులు, 36 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనుక్కోవడానికి పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

Also Read: కరోనా వేళ.. కర్నూలులో కోతులు మృతి.. భయాందోళనలో ప్రజలు..