మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

| Edited By:

Aug 04, 2020 | 9:20 PM

మహారాష్ట్రలో చాలా రోజుల తర్వాత కేసుల నమోదు సంఖ్య తగ్గుముఖం పట్టింది. అంతేకాదు.. అదే సమయంలో రికవరీలు సంఖ్య పెరిగింది. అయితే మరణాల సంఖ్య మాత్రం కలవరపెడుతోంది. తాజాగా గడిచిన..

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు
Follow us on

మహారాష్ట్రలో చాలా రోజుల తర్వాత కేసుల నమోదు సంఖ్య తగ్గుముఖం పట్టింది. అంతేకాదు.. అదే సమయంలో రికవరీలు సంఖ్య పెరిగింది. అయితే మరణాల సంఖ్య మాత్రం కలవరపెడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7,760 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,57,956కి చేరింది. వీటిలో ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని 2,99,356 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మంగళవారం నాడు 12,326 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 1,42,151 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 16,142కి చేరింది. ఇక గత మూడు నాలుగు రోజులుగా ముంబై నగరంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే అనూహ్యంగా ఇతర ప్రాంతాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.