Coronavirus: మహారాష్ట్రలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?

Maharashtra COVID-19 cases: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు

Coronavirus: మహారాష్ట్రలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
Maharashtra COVID-19 cases

Updated on: May 16, 2021 | 10:38 PM

Maharashtra COVID-19 cases: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసులు, మరణాలు పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. కాగా.. దేశంలో కరోనా ప్రారంభం నాటి నుంచి అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు అత్యధిక నమోదయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 34,389 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 974 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహరాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదివారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాలతో మొత్తం కేసుల సంఖ్య 53,78,452కు పెరగగా.. మరణాల సంఖ్య 81,486 కు చేరింది.
గత 24 గంటల వ్యవధిలో కరోనా నుంచి 59,318 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 48,26,371 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,68,109 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా.. మహారాష్ట్రలో ఎక్కువగా ముంబై నగరంలో కొత్తగా 1,544 కరోనా కేసులు నమోదు కాగా.. 60 మంది మరణించారు. ముంబైలో ఇప్పటివరకు 7లక్షలకు చేరువలో కేసులు నమోదు కాగా.. చనిపోయిన వారి సంఖ్య 14,260కు చేరింది. ప్రస్తుతం మహా నగరంలో 35,702 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. ప్రస్తుతం మహారాష్ట్ర కంటే కూడా కర్ణాటకలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో అత్యధికంగా కేసులు నమోదయ్యే స్థానంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.
Also read:

Covid-19 vaccine: తెలంగాణలో నిండుకున్న కోవిడ్ వ్యాక్సిన్లు.. రేపు కూడా రెండో డోసు బంద్

Akash Puri’s Romantic: ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాకూడా ఓటీటీ బాట పట్టనుందా.?

Loading...
Unable to load recommendations.
Follow Us