మహారాష్ట్రలో కరోనా విలయం తాండవం.. ఒక్క రోజే 122 మంది మృతి

కరోనా మహమ్మారి మహారాష్ట్రలో విలయ తాండవం సృష్టిస్తోంది. గురువారం నాడు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులతో పాటు.. మరణాలు కూడా పెద్ద ఎత్తున నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కరోనా విలయం తాండవం.. ఒక్క రోజే 122 మంది మృతి

Edited By:

Updated on: Jun 03, 2020 | 11:19 PM

కరోనా మహమ్మారి మహారాష్ట్రలో విలయ తాండవం సృష్టిస్తోంది. గురువారం నాడు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులతో పాటు.. మరణాలు కూడా పెద్ద ఎత్తున నమోదయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం నాడు.. కొత్తగా మరో 2,560 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,860కి చేరింది. ఇక వీరిలో గురువారం నాడు 996 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. వీరితో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 32,329కి చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 39,935 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇక గురువారం నాడు కరోనా బారినపడి 122 మంది మరణించారని.. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 2,587కి చేరింది.