మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే 6 వేలకు పైగా కేసులు..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 6,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో..

మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే 6 వేలకు పైగా కేసులు..

Updated on: Jul 08, 2020 | 8:37 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 6,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,23,724కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 1,23,192 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 198 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 9,448కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 91,065 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహరాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత పుణే, థానే నగరాల్లో నమోదవుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us