“మహా” పోలీసులను వదలని కరోనా.. మరో 303 మంది సిబ్బందికి పాజిటివ్

| Edited By:

Aug 21, 2020 | 12:20 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆరు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సామాన్య..

మహా పోలీసులను వదలని కరోనా.. మరో 303 మంది సిబ్బందికి పాజిటివ్
Follow us on

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆరు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజానీకాన్ని మొదలుకొని.. ప్రజాప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది. ముఖ్యంగా పోలీసులను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల మందికి పైగా పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీటిలో ప్రస్తుతం రెండు వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 303 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన పోలీసు సిబ్బంది సంఖ్య 13,180కి చేరింది. వీటిలో ప్రస్తుతం 2,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 5 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 136 మంది మరణించారు.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం