మహా పోలీసులను వణికిస్తోన్న కరోనా..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. ఇప్పటికే లక్షన్నరకుపైక కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీరిలో నాలుగు వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి.రాష్ట్రంలో ముఖ్యంగా ముంబై, థానే,పూణే పట్టణాల్లో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక పోలీసు సిబ్బందికి కూడా కరోనా మహమ్మారి సోకుతుండటంతో అక్కడి వారంతా గజగజవణికిపోతున్నారు. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2095 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ […]

మహా పోలీసులను వణికిస్తోన్న కరోనా..

Edited By:

Updated on: May 28, 2020 | 3:12 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. ఇప్పటికే లక్షన్నరకుపైక కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీరిలో నాలుగు వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి.రాష్ట్రంలో ముఖ్యంగా ముంబై, థానే,పూణే పట్టణాల్లో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక పోలీసు సిబ్బందికి కూడా కరోనా మహమ్మారి సోకుతుండటంతో అక్కడి వారంతా గజగజవణికిపోతున్నారు. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2095 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గడిచిన 24 గంటల్లో 131 మంది సిబ్బందికి కరోనా సోకగా.. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1178 యాక్టివ్ కేసులు ఉండగా.. 897 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు.