Maharashtra Covid cases: “మహా” విలయం.. పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య.. గత 24 గంటల్లో..

ఒకవైపు ఒమిక్రాన్‌..మరోవైపు కరోనా..దేశంపై పంజా విసిరాయి. కేసులు రెట్టింపవుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే..

Maharashtra Covid cases: మహా విలయం.. పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య.. గత 24 గంటల్లో..
Maharashtra Covid Cases
Follow us

|

Updated on: Jan 05, 2022 | 9:07 AM

Maharashtra Covid cases: ఒకవైపు ఒమిక్రాన్‌..మరోవైపు కరోనా..దేశంపై పంజా విసిరాయి. కేసులు రెట్టింపవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 2,215కు చేరాయి. ఇక 57వేలు దాటిపోయాయి కరోనా కేసులు. దేశంలో పాజిటివిటీ రేటు కూడా పెరిగిపోతోంది. కరోనా, ఒమిక్రాన్‌ జెట్‌ స్పీడ్‌తో విస్తరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వాణిజ్య రాజధాని మహారాష్ట్రలో కరోనా కోరలు చాచింది. ఒక్కరోజులోనే 18వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక 653కు చేరాయి ఒమిక్రాన్‌ కేసులు. మహారాష్ట్ర తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 382మందికి ఒమిక్రాన్‌ నిర్థారణ అయింది. కేసులు పెరుగుతుండటంతో వీకెండ్‌ కర్ఫ్యూ విధించింది ఢిల్లీ సర్కార్‌.

మహారాష్ట్రలో అత్యధికంగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే, సోమవారం నాటికి ఒమిక్రాన్ సోకిన 600 మందిలో ఒకరి పరిస్థితి మాత్రమే విషమంగా ఉందని తెలుస్తోంది. 8 మందికి మాత్రం స్వల్ప లక్షణాలను కనిపిస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ చెప్పిన లెక్కల ప్రకారం.. మహారాష్ట్రలో ఓమిక్రాన్ సోకిన 578 మందిలో, 436 మందికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదని..అయితే 133 మందికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని పేర్కొంది.

ఓమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య పరంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మంగళవారం ఇక్కడ మరో 75 మందికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారించబడింది. ఈ వేరియంట్‌తో బాధపడుతున్న మొత్తం వ్యక్తుల సంఖ్య రాష్ట్రంలో 653కి చేరుకుంది.  

టీకా తీసుకున్నవారిలో ఓమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉందని తెలుస్తోంది. మహారాష్ట్రలో సోమవారం వరకు ఈ వేరియంట్ ద్వారా ప్రభావితమైన 578 మందిలో, 365 మందికి అంటే 63 శాతానికి పైగా ప్రజలు టీకాలు వేశారు. 154 మందికి టీకాలు వేయకపోగా 59 మంది పరిస్థితి వెంటనే కంట్రోల్‌లోకి వచ్చిందినట్లుగా సమాచారం.

టీకాలు వేయని వారిలో 18 ఏళ్లలోపు వారు కూడా ఉన్నారు. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అందించిన సమాచారం ప్రకారం.. ఈ 578 మందిలో 20 మంది 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కాగా మిగిలిన 32 మంది 10 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సుల వారని వెల్లడించింది.

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 18 వేలు దాటింది

మంగళవారం మహారాష్ట్రలో 18,466 కొత్త కోవిడ్ -19 కేసులు రావడంతో, మొత్తం సోకిన వారి సంఖ్య 67,30,494 కు పెరిగింది, మరో 20 మంది రోగుల మరణాల కారణంగా మరణాల సంఖ్య 1,41,573 కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మునుపటి రోజుతో పోలిస్తే కొత్త ఇన్ఫెక్షన్ కేసులలో 52 శాతం పెరుగుదల నమోదైంది.

ఈ సమయంలో మహారాష్ట్రలో 75 కొత్త ఒమిక్రాన్ తరహా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 653 ఒమిక్రాన్ కేసులు నిర్ధారించబడ్డాయి. ఓమిక్రాన్ కొత్త కేసులలో, రాజధాని ముంబై నుండి 40 కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

ముంబైలో కేసులు పెరిగాయి

మంగళవారం రాజధాని ముంబైలో 10,860 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజుతో పోలిస్తే కొత్త ఇన్ఫెక్షన్ కేసులలో 34.37 శాతం పెరుగుదల నమోదైంది. రోజువారీ ఇన్‌ఫెక్షన్ కేసుల సంఖ్య ఏప్రిల్ 7, 2021 తర్వాత అత్యధికంగా ఉంది.

ముంబైలో గత 24 గంటల్లో కోవిడ్ వ్యాప్తి కారణంగా ఇద్దరు రోగులు మరణించారు. కొత్త కేసుల రాకతో ముంబైలో మొత్తం సోకిన వారి సంఖ్య 8,18,462 కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 16,381 మంది రోగులు మరణించారు. గత 24 గంటల్లో, 654 మంది రోగులు ఇన్‌ఫెక్షన్ నుండి కోలుకున్నట్లు నిర్ధారించంది ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ. ఆ తర్వాత ఇన్‌ఫెక్షన్ నుంచి కోలకున్నవారి సంఖ్య 7,52,012 కు చేరింది.

ఇవి కూడా చదవండి: APSRTC Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు..

Chinese Pigeon: ఒడిశాలో చైనా గూఢాచారి పావురాలు.. వాటి కాలికి పచ్చ కట్లు.. అవేంటో..

విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..