Maharashtra Night Curfew: మహారాష్ట్రలో కొవిడ్‌ ఉగ్రరూపం.. ఒక్కరోజే 41,434 కేసులు.. నైట్ కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు

కరోనాకు పగ్గాల్లేకుండా పోయింది. పాజిటివిటీ రేటు అమాంతం పెరిగిపోయింది. దేశంలో రోజూవారీ కేసులు లక్ష దాటుతున్నాయి.

Maharashtra Night Curfew: మహారాష్ట్రలో కొవిడ్‌ ఉగ్రరూపం.. ఒక్కరోజే 41,434 కేసులు.. నైట్ కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు
Maharashtra Corona Cases

Updated on: Jan 08, 2022 | 9:41 PM

మహారాష్ట్రలో కొవిడ్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఒక్కరోజు వ్యవధిలో 41 వేల 434 కేసులు నమోదయ్యాయి. 13 మంది కరోనాతో చనిపోయారు. మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 1009కి చేరింది. ఇక.. ముంబై మహానగరంలో 20 వేల 318 కరోనా కేసులు వెలుగుచూశాయి. బాంద్రా సీబీఐ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. 68 మంది సీబీఐ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కఠిన ఆంక్షలు విధించింది. ఈ నెల 10 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. పాఠశాలలు కూడా ఫిబ్రవరి 15 వరకు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది ఫిబ్రవరి  50 శాతం ఆక్యూపెన్సీ రేటుతో మాల్స్, థియేటర్స్ నడవనున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 20 వేల 181 కేసులు నమోదవగా.. ఏడుగురిని పొట్టనబెట్టుకుంది కరోనా. కర్నాటకలో కొత్తగా 8 వేల 906 కేసులు బయటపడ్డాయి.  వెస్ట్‌బెంగాల్‌లో కేసుల తీవ్రత తగ్గడం లేదు. రాష్ట్రంలో 18 వేల 802 కేసులు నమోదుకాగా.. 19 మందిని బలితీసుకుంది కరోనా. ఇక్కడ రోజూవారీ పాజిటివిటీ రేటు 29.6 శాతంగా ఉంది. కేరళలోనూ కరోనా కోరలు చాస్తోంది. రాష్ట్రంలో నేడు 5 వేల 944 కేసులు నమోదుకాగా.. అత్యధికంగా 33 మంది బలయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణలో 2 వేల 606 కేసులు వెలుగుచూశాయి. ఏపీలో కొత్తగా 839 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు చనిపోయారు. చండీగఢ్‌లో 541 కేసులు బయటపడ్డాయి.

Also Read: Coronavirus: దేశంలో కరోనా టెర్రర్.. పార్లమెంట్​లో 350 మందికి పాజిటివ్

ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్