Mahabharat actor Satish Kaul : ఆల్ టైమ్ క్లాసిక్ సీరియల్ మహాభారతంలో ఇంద్రుడిగా నటించిన సతీష్ కౌల్ దీనస్థితి.. చివరికి..

|

Apr 10, 2021 | 8:22 PM

Mahabharat actor Satish Kaul dies : మహాభారతం సీరియల్‌లో ఇంద్రుడి పాత్రను అమోఘంగా పడించి అందరి మన్ననలు అందుకున్న..

Mahabharat actor Satish Kaul : ఆల్ టైమ్ క్లాసిక్ సీరియల్ మహాభారతంలో ఇంద్రుడిగా నటించిన సతీష్ కౌల్ దీనస్థితి.. చివరికి..
Koul
Follow us on

Mahabharat actor Satish Kaul dies : మహాభారతం సీరియల్‌లో ఇంద్రుడి పాత్రను అమోఘంగా పడించి అందరి మన్ననలు అందుకున్న సతీష్ కౌల్ ఇకలేరు. కొన్ని రోజులుగా సతీష్ కౌల్ కరోనాతో బాధ పడుతున్నారు. రెండురోజులుగా ఆయన ఆరోగ్యం విషమిస్తూ వచ్చి చివరికి ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. సతీష్ కౌల్ వయసు 74 సంవత్సరాలు. లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సతీష్ కు ఫిల్మ్ ఇండస్ట్రీ బాసటగా నిలిచి ఆదుకుంది. కొన్నేళ్లుగా ఈయన పంజాబ్‌లోని లుధియానాలో ఒక చిన్న ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజులుగా సతీష్ కౌల్ కనీసం నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేసే స్థితిలో లేరని సమాచారం.

బిఆర్ చోప్రా తెరకెక్కించిన ఆల్ టైమ్ క్లాసిక్ సీరియల్ మహాభారతంలో ఇంద్రుడిగా నటించిన సతీష్ కౌల్ ఎంతోమంది మన్ననలు పొందారు. మహాభారతంతో పాటు సుమారు 300 హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించారు సతీష్ కౌల్. వాటిలో ‘ప్యార్ తో హోనాహి థా’, ‘కర్మ’, ‘ప్రేమ్ పర్బాట్’, ‘వారెంట్’, ‘గునాహో కా ఫైస్లా’, ‘భక్తి మీ శక్తి’, ‘డాన్స్ డాన్స్’, ‘రామ్ లఖన్’, ‘ఆంటీ నెంబర్ 1’, ‘విక్రమ్ బేటల్’ లాంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 2015లో జరిగిన యాక్సిడెంట్ తో ఆయన పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయారు. 2019లో సతీష్ కౌల్ పరిస్థితిని గమనించిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అటు, కపిల్ శర్మ కూడా సతీష్ కౌల్ ను ఆర్థికంగా కొంత సాయం చేశారు. సతీష్ కౌల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read also : పోలీస్ కుక్కలకి కూలర్లు.. మెరుగైన విచారణకు దోహదపడతాయని విజయనగరం జిల్లా ఎస్పీ కొత్త స్టెప్