కరోనా మృతుని కోసం 3 నెలలుగా ఆస్పత్రిలోనే కన్నీళ్లతో ఎదురుచూస్తోన్న కుక్క

కుక్క విశ్వాసం ఎంత గొప్పదో మనందరికీ తెలిసిన విషయమే. అవి ప్రేమిస్తే ఎలా ఉంటుందో.. ద్వేషించినా అదే స్థాయిలో ఉంటుంది. 'పట్టెడు అన్నం పెట్టిన విశ్వాసాన్ని కుక్క.. జీవితాంతం మరిచిపోదు' అంటారు. అదే మరోసారి నిజం చేసింది చైనాకి చెందిన ఓ కుక్క. కరోనా వైరస్‌తో చనిపోయిన తన యజమాని...

కరోనా మృతుని కోసం 3 నెలలుగా ఆస్పత్రిలోనే కన్నీళ్లతో ఎదురుచూస్తోన్న కుక్క

Edited By:

Updated on: May 26, 2020 | 8:35 PM

కుక్క విశ్వాసం ఎంత గొప్పదో మనందరికీ తెలిసిన విషయమే. అవి ప్రేమిస్తే ఎలా ఉంటుందో.. ద్వేషించినా అదే స్థాయిలో ఉంటుంది. ‘పట్టెడు అన్నం పెట్టిన విశ్వాసాన్ని కుక్క.. జీవితాంతం మరిచిపోదు’ అంటారు. అదే మరోసారి నిజం చేసింది చైనాకి చెందిన ఓ కుక్క. కరోనా వైరస్‌తో చనిపోయిన తన యజమాని కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. తన యజమాని చనిపోయాడన్న విషయం తెలియక గత మూడు నెలలుగా.. ఆస్పత్రిలోనే కన్నీళ్లతో రాత్రింబవళ్లు నిరీక్షిస్తోంది ఆ శునకం. కానీ ఆ మూగ జీవికి తెలీదు కదా.. దాని యజమాని ఎప్పటికీ తిరిగి రాడన్న విషయం.

చైనాలోని వూహాన్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను కదిలిస్తోంది. వూహాన్‌కు చెందిన ఓ వ్యక్తికి కోవిడ్ సోకడంతో మూడు నెలల క్రితం ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అతను వెళ్తూ.. తన పెంపుడు కుక్క గ్జియావో బేవోను కూడా తీసుకెళ్లాడు. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత అతను తీవ్ర అనారోగ్యంతో ఐదు రోజుల్లోనే కరోనాతో మృతి చెందాడు. కానీ తన యజమాని మరణించాడని తెలియక.. అది హాస్పిటల్‌లోనే ఉంటుంది.

అయితే ఆ కుక్కని చూసిన ఆస్పత్రి సిబ్బంది గుండెలు కరిగిపోయాయి. దీంతో దానిని తీసుకెళ్లి దూరంగా వేరే ప్రదేశంలో వదిలేసి వచ్చారు. కానీ ఆ కుక్క మళ్లీ.. అదే ఆస్పత్రికి వచ్చి.. అదే చోటులో నిరీక్షించడం మొదలు పెట్టింది. ఇది గమనించిన కొందరు గ్జియావో బేవో ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. కాగా యజమానిపై దానికున్న ప్రేమను అర్థం చేసుకున్న ఆస్పత్రి సిబ్బంది అప్పటి నుంచి దాని బాగోగులు చూసుకున్నారు. అయితే ఇటీవలే దానిని యానిమల్ కేర్ ఆర్గనైజేషన్‌కు అప్పగించారు.

Read More:

మీరు వింటున్న ‘కరోనా కాలర్ ట్యూన్’ గొంతుక ఈమెదే

రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి..

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్