Oximeter APP: అందుబాటులో ఆక్సీమీట‌ర్ లేదా..? స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. యాప్‌తో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌..

|

May 24, 2021 | 7:48 PM

Oximeter APP: క‌రోనా సోకిన వారిలో ఎక్కువ మందిలో క‌నిపిస్తోన్న స‌మ‌స్య ఆక్సిజ‌న్ స్థాయిలు ప‌డిపోవ‌డం. అప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్యంగా ఉండే వ్య‌క్తి ఆక్సిజ‌న్ స్థాయిలు ప‌డిపోయే స‌రికి ఒక్క‌సారిగా మ‌ర‌ణానికి...

Oximeter APP: అందుబాటులో ఆక్సీమీట‌ర్ లేదా..? స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. యాప్‌తో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌..
Oxygen Levels With App
Follow us on

Oximeter APP: క‌రోనా సోకిన వారిలో ఎక్కువ మందిలో క‌నిపిస్తోన్న స‌మ‌స్య ఆక్సిజ‌న్ స్థాయిలు ప‌డిపోవ‌డం. అప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్యంగా ఉండే వ్య‌క్తి ఆక్సిజ‌న్ స్థాయిలు ప‌డిపోయే స‌రికి ఒక్క‌సారిగా మ‌ర‌ణానికి చేరువ‌వుతున్నారు. ఈ కార‌ణంగా ఆక్సిజ‌న్ స్థాయిల‌ను ఎప్ప‌టికప్పుడు చెక్ చేసుకుంటూ జాగ్ర‌త్తలు తీసువాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆక్సీమీట‌ర్ వినియోగం పెరిగిపోయింది. ప్ర‌స్తుత రోజుల్లో ఆక్సీమీట‌ర్ ప‌రిక‌రం లేని ఇళ్లు లేద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తిలేదు.
అయితే ఆక్సీమీట‌ర్‌కు ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌స్తుతం ప‌లు మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. తాజాగా కోల్‌క‌తాకు చెందిన ఓ స్టార్టప్ ఆక్సీజ‌న్‌ను గుర్తించే యాప్‌ను రూపొందించింది. కేర్‌ప్లిక్స్ వైట‌ల్స్ (CarePlix Vitals) పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా సుల‌భంగా శ‌రీరంలోని ఆక్సీజ‌న్‌ స్థాయిల‌ను తెలుసుకోవ‌చ్చ‌ని యాప్ నిర్వాహ‌కులు చెబుతున్నారు. స్మార్ట్ కెమెరా, ఫ్లాష్‌లైట్‌పై వేలు ఉంచితే ఆక్సీజ‌న్ స్థాయిల‌ను గుర్తించ‌వ‌చ్చు. 40 సెకండ్ల‌పాటు వేలితో కెమెరాను మూస్తే.. లైట్ సెన్సిటివిటీ ఆధారంగా పీపీజీ గ్రాఫ్‌ను చూపిస్తుంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన ఈ యాప్ ఇప్ప‌టికే 1200 మంది ఉప‌యోగిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా సుమారు 96 శాతం డేటాను డాక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే సేక‌రించిన‌ట్లు వివ‌రించారు.

Also Read: Online Class with Towel: ఆన్‌లైన్‌ క్లాసులకు టవల్‌తో రండి..! విద్యార్థినిలకు ఆర్డర్ చేసిన టీచర్..! కట్ చేస్తే…

Mini Human Heart: వైద్య రంగంలో మరో అద్భుతం.. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సరికొత్త ఆవిష్కరణ..

Portable Medical Ventilator: తక్కువ ఖర్చుతో వెంటిలేటర్..ఆవిష్కరించిన హైదరాబాద్ సంస్థ.. గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనకారి!