దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోల్ కతా విమానాశ్రయం తాజా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబై, పూణే, నాగపూర్, చెన్నై, అహమ్మదాబాద్ నగరాల నుంచి తాము సిటీలోకి విమానాలను అనుమతించబోమని ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్ఛేవరకు ఈ ఆదేశాలు ఈ నెల 6 నుంచి 19 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. కోవిడ్-19 హాట్ స్పాట్ ప్రాంతాల నుంచి విమానాలను నిలిపివేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో కోల్ కతా విమానాశ్రయ అధికారులు తామే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే కోల్ కతా నుంచి బయల్దేరే విమానాలకు ఈ బ్యాన్ వర్తించబోదు. దేశంలో ఇప్పటివరకు 6.48 లక్షల మంది కరోనా వైరస్ కి గురయ్యారు. 18,500 మంది కరోనా రోగులు మరణించారు.
It is informed that no flights shall operate to Kolkata from Delhi,Mumbai, Pune, Nagpur,Chennai & Ahmedabad from 6th to 19th July 2020 or till further order whichever is earlier. Inconvenience caused is regretted.@AAI_Official @MoCA_GoI @ushapadhee1996 @HardeepSPuri @arvsingh01
— Kolkata Airport (@aaikolairport) July 4, 2020