
కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. 25 కేసుల్లో కరోనా వైరస్ ఎవరి నుంచి వ్యాపించిందో తెలుసుకునేందుకు కొత్తగా సెంటినల్ సర్వేలియన్స్ విధానాన్ని చేబట్టింది.. అంటే ఎలాంటి పాజిటివ్ లక్షణాలు లేని వ్యక్తుల ద్వారా కూడా ఈ వైరస్ సోకుతోందన్న విషయాన్ని గ్రహించి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న పధ్నాలుగు జిల్లాల్లో హెల్త్ వర్కర్స్ ప్రజల నమూనాలను సేకరిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను ఖండించడం విశేషం. ఏమైనా ఈ విధానంలో సేకరించిన నమూనాలో ఇద్దరు వ్యక్తులవి పాజిటివ్ లక్షణాలని తేలిందట.. ఈ సాంపిల్స్ ని పంచాయతీల్లోని ప్రధాన ఆసుపత్రుల వద్ద సేకరిస్తున్నారు.