
కర్నాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 3,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47,253కి చేరింది. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు నగరంలోనే నమోదవుతున్నాయి. బుధవారం నాడు బెంగళూరు నగరంలోనే 1,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అన్‌లాక్ 1.0 తర్వాత కర్ణాటక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,853 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.
3176 new #COVID19 positive cases have been reported in Karnataka today of which 1975 cases are from Bengaluru, taking the total number of cases to 47253. Death toll rises to 928 after 87 deaths were reported today: State Health Department pic.twitter.com/WRt194hxyU
— ANI (@ANI) July 15, 2020