మరో ప్రముఖ హీరో, ఆయన భార్యకు కరోనా..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతుంది. అందులోనూ సినీ ఇండస్ట్రీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఎంతో మంది సినిమా నటులు, సీరియల్ యాక్టర్స్‌ ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో చాలా వరకు షూటింగులన్నీ రద్దు..

మరో ప్రముఖ హీరో, ఆయన భార్యకు కరోనా..

Edited By:

Updated on: Jul 15, 2020 | 5:58 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతుంది. అందులోనూ సినీ ఇండస్ట్రీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఎంతో మంది సినిమా నటులు, సీరియల్ యాక్టర్స్‌ ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో చాలా వరకు షూటింగులన్నీ రద్దు అయ్యాయి. అలాగే టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక ఇటీవలే బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్‌‌ కుటుంబానికి కరోనా సోకిన విషయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్త తెలిసిన ఆయన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. జయ బచ్చన్ మినహా అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలకు కోవిడ్ నిర్థారణ అయింది. ప్రస్తుతం వీరందరూ చికిత్స తీసుకుంటున్నారు.

ఇప్పుడు తాజాగా కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జాతో పాటు ఆయన సతీమణి ప్రేరణకు కోవిడ్ నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ధృవ్ స్వయంగా ట్వీట్టర్ వేదికగా తెలిపారు. ‘గత కొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలు కనిపించడంతో మేము టెస్టులు చేసుకోగా.. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందనీ, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని ఆయన పేర్కొన్నారు. ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేసుకోవాలని పిలుపునిచ్చారు’ ధృవ్.

Read More:

ఉస్మానియా ఆస్పత్రిలో భారీగా వర్షపు నీరు.. కొట్టుకుపోయిన పీపీఈ కిట్లు..

కొత్త జిల్లాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు..

హైదరాబాద్‌లో కరోనా జోరు.. హైరిస్క్ ప్రాంతాల్లో కొత్త రూల్స్..