ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఈ మహమ్మారి బారినపడి.. తీవ్ర కష్టాల్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో మనదేశంలో కూడా ఈ వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఈ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఓ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. సహచరులంతా షాక్‌కు గురయ్యారు. సదరు జర్నలిస్టు.. ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్‌నాథ్ ప్రెస్‌మీట్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతకుముందు.. ఆ జర్నలిస్టు కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్ అని తెలుస్తోంది. అయితే మాజీ సీఎం ప్రెస్‌మీట్‌కు వెళ్లిన జర్నలిస్టులందరు.. క్వారంటైన్ కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.