అక్కడ ఓ మంత్రి, ఎమ్మెల్యేకు కరోనా..వారి కాంట్రాక్ట్‌లు తెలిస్తే..షాకే?

|

Jul 08, 2020 | 5:47 PM

జార్ఖండ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. జార్ఖండ్‌ రాష్ట్రంలో ఓ మంత్రికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు భయాందోళనలకు గురవుతున్నారు.

అక్కడ ఓ మంత్రి, ఎమ్మెల్యేకు కరోనా..వారి కాంట్రాక్ట్‌లు తెలిస్తే..షాకే?
Follow us on

జార్ఖండ్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. జార్ఖండ్‌ రాష్ట్రంలో ఓ మంత్రికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు భయాందోళనలకు గురవుతున్నారు. జేఎంఎం పార్టీకి చెందిన ఆ మంత్రికి మంగళవారం సాయంత్రం కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను రాత్రి పొద్దుపోయిన తర్వాత రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)కు తరలించారు. అంతకుముందు అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో 53 ఏండ్ల ఆ ఎమ్మెల్యేకు ధన్‌బాద్‌లోని బీసీసీఎల్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఈ ఇద్దరు కరోనా బాధితులు నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిశారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారులు భయపడుతున్నారు. అదే విధంగా ఆ ఎమ్మెల్యే సోమవారం సాయంత్రం సింద్రీలో జరిగిన ఓ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో దాదాపుగా 150 మంది వరకు పాల్గొన్నారని తెలుస్తోంది. దీంతో అధికార యతాంగ్రం మొత్తం హడలెత్తిపోతున్నారు. జార్ఖండ్‌లో ఇప్పటివరకు 3000 కరోనా కేసులు నవెూదయ్యాయి. మంగళవారం కొత్తగా 149 పాజిటివ్‌ కేసులు నవెూదయ్యాయి