కరోనా కాలంలో బ్లూ టూత్ ‘సి-మాస్క్’.. జపాన్ అద్భుత సృష్టి

| Edited By: Pardhasaradhi Peri

Jul 01, 2020 | 4:11 PM

ఈ కరోనా కాలంలో వివిధ రకాల మాస్కులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆయా ధరలను బట్టి వెరైటీ రంగుల్లో.. వెరైటీ మాస్కులు లభ్యమవుతున్నాయి. అవన్నీ ఒక ఎత్తయితే.. జపాన్ లో 'డోనట్ రోబోటిక్స్' అనే స్టార్టప్ సంస్థ తయారు చేసిన..

కరోనా కాలంలో బ్లూ టూత్ సి-మాస్క్.. జపాన్ అద్భుత సృష్టి
Follow us on

ఈ కరోనా కాలంలో వివిధ రకాల మాస్కులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆయా ధరలను బట్టి వెరైటీ రంగుల్లో.. వెరైటీ మాస్కులు లభ్యమవుతున్నాయి. అవన్నీ ఒక ఎత్తయితే.. జపాన్ లో ‘డోనట్ రోబోటిక్స్’ అనే స్టార్టప్ సంస్థ తయారు చేసిన విశిష్టమైన మాస్క్ ది సరికొత్త రికార్డు. ఇంటర్నెట్ తో కనెక్ట్ అయిన స్మార్ట్ మాస్క్ ని ఈ సంస్థ డెవలప్ చేసింది. ఇది మెసేజ్ లని ట్రాన్స్ మిట్  చేయడమే గాక,, జపనీస్ భాషను మరో ఎనిమిది ఇతర భాషలోకి అనువాదం చేయగలదట. వైట్ ప్లాస్టిక్ ‘సి-మాస్క్’ అని వ్యవహరించే దీన్ని బ్లూ టూత్ లో ఓ స్మార్ట్ ఫోన్ కి, టాబ్లెట్ అప్లికేషన్ కి కనెక్ట్ చేయడం విశేషం. ఈ వ్యవస్థ…. మాటలను టెక్స్ట్ మెసేజులుగా మార్చడమే గాక, కాల్స్ చేయగలదని, దీన్ని ధరించిన వారి వాయిస్ (గొంతు) ఎదుటివారికి  స్పష్టంగా, గట్టిగా వినబడేట్టు ‘చూడగలదని’ ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ‘టైసుకే ఓనో ‘ తెలిపారు. ఈ మాస్కును తయారు చేసేందుకు ఇంజనీర్లు ఎంతో కాలం కృషి చేశారని ఆయన చెప్పారు. కరోనా వైరస్ ఈ సమాజాన్ని ఎలా మార్చేసిందో.. ఈ వైరస్ ని ఎదుర్కొనేందుకు ఎలాంటి  ప్రాడక్టు అవసరమో అని పరిశోధనల వంటివి చేసి అత్యాధునిక టెక్నాలజీతో ఈ మాస్క్ ని తయారు చేశారని ఆయన వివరించారు.

ఈ మాస్కులు సెప్టెంబరు నుంచి మార్కెట్ లోకి వస్తాయని,  మొదటి దశలో చైనా, అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నామని ఆయన వివరించారు. ఒక్కో మాస్క్ ధర 40 అమెరికన్ డాలర్లకు లభ్యమవుతుందన్నారు.