కరోనా అంటే వణికిపోతున్నాం-శ్రీదేవి కూతురు

ఆ కుటుంబాన్ని కరోనా భయం వీడటం లేదు. కొద్ది రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండి వచ్చిన బోనీ కపూర్ ఫ్యామిలీని ఆ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయట . ఇదే విషయాన్ని అతిలోక సుందరి శ్రీదేవి కూతురు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ చెప్పారు. లాక్‌డౌన్‌లో తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న సమయంలో భయంకరమైన ఓ న్యూస్ తమను మరింత వణికించిందని జాన్వి చెప్పారు. హోం క్వారంటైన్ గురుంచి ఓ మీడియా ఛానల్ అడిగిన ప్రశ్నలకు ఇలా […]

కరోనా అంటే వణికిపోతున్నాం-శ్రీదేవి కూతురు

Edited By:

Updated on: Jun 12, 2020 | 3:46 PM

ఆ కుటుంబాన్ని కరోనా భయం వీడటం లేదు. కొద్ది రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండి వచ్చిన బోనీ కపూర్ ఫ్యామిలీని ఆ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయట . ఇదే విషయాన్ని అతిలోక సుందరి శ్రీదేవి కూతురు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ చెప్పారు. లాక్‌డౌన్‌లో తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న సమయంలో భయంకరమైన ఓ న్యూస్ తమను మరింత వణికించిందని జాన్వి చెప్పారు.

హోం క్వారంటైన్ గురుంచి ఓ మీడియా ఛానల్ అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పారు జాన్వి… `మా ఇంట్లో పని చేస్తున్న వారిలో ఒక‌రికి కరోనా సోకినట్టు తెలియ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌య్యాము. ఆ తర్వాత మేమందరం కరోనా టెస్టులు చేయించుకున్నాం… మిగిలిన ప‌నివారికి కూడా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించాం… వారిలో ఇద్ద‌రికి పాజిటివ్ అని తేలింది. దీంతో మరింత భయపడిపోయాం. ప్రస్తుతం ముగ్గురూ కోలుకుని సురక్షితంగా బయటపడ్డారని తెలిపింది. కానీ ఆ రోజును ఇప్పటికీ తాము మరిచిపోటం లేదని… కొవిడ్ అంటేనే వణుకువస్తోందని అన్నారు.