హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు

జబర్ధస్త్ కమేడియన్ రాఘవ హోం క్వారంటైన్ అయ్యారు. జబర్దస్త్‌లోకి రాక ముందు అడపాదడపా.. పలు సినిమాల్లో కనిపించిన రాఘవ.. ఈ కామెడీ షోతో ఎంతో ఫేమస్ అయ్యారు. తాజాగా ఈ నటుడికి తెలంగాణ వైద్యాధికారులు హోం క్వారంటైన్ స్టాంప్...

హోమ్ క్వారంటైన్‌లో జబర్దస్త్ నటుడు

Updated on: May 28, 2020 | 2:02 PM

జబర్ధస్త్ కమేడియన్ రాఘవ హోం క్వారంటైన్ అయ్యారు. జబర్దస్త్‌లోకి రాక ముందు అడపాదడపా.. పలు సినిమాల్లో కనిపించిన రాఘవ.. ఈ కామెడీ షోతో ఎంతో ఫేమస్ అయ్యారు. తాజాగా ఈ నటుడికి తెలంగాణ వైద్యాధికారులు హోం క్వారంటైన్ స్టాంప్ వేశారు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారందరికీ ఆయా రాష్ట్ర సరిహద్దుల్లో ప్రభుత్వాలు కరోనా పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇలాగే జబర్దస్త్ కమేడియన్ రాఘవ కూడా సూర్య పేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం నుంచి తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ని వైద్యాధికారులు కరోనా టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో రాఘవకు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. దీంతో ఏపీ నుంచి వచ్చిన రాఘవకు హోం క్వారంటైన్‌ స్టాంప్ వేసినట్లు ఓ స్థానిక మండల వైద్యాధికారి తెలిపారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్న విషయం తెలిసిందే.

Read More:

ఏపీకి ‘ప్రత్యేక హోదా’ తప్పక సాధిస్తాం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వరంగల్ మర్డర్ మిస్టరీలో బయటపడ్డ మరో కొత్త కోణం.. 10 కూడా కాదు..

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!

ఏపీ వాహనదారులకు మరో శుభవార్త.. ఇక వాట్సాప్‌ నుంచి రవాణా శాఖ సేవలు..

Loading...
Unable to load recommendations.
Follow Us