Corona Virous: మొబైల్స్.పై కూడా కరోనా వైరస్.. స్మార్ట్ ఫోన్స్ ను సురక్షితంగా శుభ్రం చేసుకోవడం ఎలా అంటే..!

|

Apr 21, 2021 | 5:27 PM

Corona Virous: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్...

Corona Virous: మొబైల్స్.పై కూడా కరోనా వైరస్.. స్మార్ట్ ఫోన్స్ ను సురక్షితంగా శుభ్రం చేసుకోవడం ఎలా అంటే..!
Follow us on

Corona Virous: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ రూపంలోనైనా జరగవచ్చని… తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వాహకాలుగా ఏటీఎం మిషన్స్, టి షాప్స్ పని చేస్తున్నాయి. అయితే ఈ లిస్ట్ లో స్మార్ట్ ఫోన్లను కూడా చేరుస్తున్నారు

తిండి నిద్ర లేకుండా అయినా మనిషి బతుకుతాడు ఏమో కానీ చేతిలో స్మార్ట్‌ఫోన్ల లేకుండా మాత్రం జీవించలేడు.. ఇక బయటికి వెళ్ళితే వెంట ఫోన్ ఉండాల్సిందే.. అయితే మన చేతులను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ చేతులతో ఫోన్లను పట్టుకుంటాం. దీంతో చేతుల ద్వారా ఫోన్లకు వైరస్ అంటే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌పై ఉన్న వైరస్‌ను తొలగించేందుకు అప్పుడప్పుడు ఫోన్‌ను శుభ్రపరచుకుంటూ ఉండాలి. అలా ఫోన్లను శుభ్రపరచుకోవడానికి 3 సులభమైన చిట్కాలను తెలుసుకుందాం..!

అయితే చాలా మంది చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్ తో స్మార్ట్ ఫోన్లను క్లిన్ చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం.. ఒకొక్కసారి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. లేదా ఫోన్ స్క్రీన్ పై మచ్చలు ఏర్పడడం… వంటివి జరుగుతాయి. అందుకని మొబైల్ నుక్లిన్ చేసుకునే కొన్ని చిట్కాలను పాటించి మీ ఫోన్ ను శుభ్రం చేసుకోండి.

ఇంటి నుంచి బయటకు వెళ్లి.. తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు శరీరం, మొబైల్‌పై వైరస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మొబైల్స్‌ను శుభ్రం చేసుకోవడానికి మార్కెట్‌లో దొరికే 70 శాతం ఆల్కహాల్ ఉండే శానిటైజర్‌ను తీసుకోవాలి. స్మూత్‌గా ఉంటే చిన్న తెల్లటి గుడ్డని తీసుకుని ఒక్క డ్రాప్ ఆల్కహాల్ శానిటైజర్ ఫోన్ ను శుభ్రపరచుకోవాలి.

ముందుగా మొబైల్ ఫోన్‌ను స్విచ్‌ఆఫ్ చెసుకుని తర్వత ఒక చిన్న కాటన్ క్లాత్ ను తీసుకోవాలి. మొబైల్‌పై కొంచెం శానిటైజర్ వేసుకుని కాటన్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఇప్పుడు మార్కెట్ లో యాంటీ బాక్టీరియల్ టిష్యులు లభ్యమవుతున్నాయి. వీటిని సెల్ ఫోన్ ను శుభ్రం చేయడానికి ఉపయొగించాలి. ఇది చాలా సురక్షితమైన పద్ధతి. ఏదైనా మెడికల్ షాప్స్ లో ఇవి దొరుకుతాయి. ఈ పేపర్లు చాలా పొడిగా ఉంటాయి. వీటి వల్ల మొబైల్ డిస్‌ప్లే సురక్షితంగా ఉంటుంది.

Also Read: కొవిడ్ నిబంధనల నడుమ భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం.. రేపు శ్రీ రామ పట్టాభిషేకం 

కరోనా వైరస్ లక్షణాలు.. సీజనల్ వ్యాధుల లక్షణాలకు మధ్య గల తేడా ఏమిటంటే..!