‘కరోనా వైరస్ ని వ్యాపింపజేయాలట’.. ఇన్ఫోసిస్ ఉద్యోగి నిర్వాకం.. అరెస్ట్

| Edited By: Pardhasaradhi Peri

Mar 28, 2020 | 1:10 PM

ఓ వైవు కోవిడ్-19 మహమ్మారితో దేశం నానా అగచాట్లూ పడుతుంటే కొందరికి ఇది ఓ వినోదంలా కనిపిస్తోంది. ఉదాహరణకు బెంగూరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఒకరు.. ఈ వ్యాధిని అడ్డుపెట్టుకుని అమాయక ప్రజలతో చెలగాటమాడుతున్నారు. ఇళ్లలో కాకుండా బయట వీధుల్లోకి వెళ్లి  తుమ్మాలని, కరోనా వైరస్ ని వ్యాపింపజేయాలంటూ ఇతగాడు తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. 25 ఏళ్ళ ఇతడ్ని ముజీబ్ మహ్మద్ గా గుర్తించారు. ఈ విపత్కర సమయంలో ఇలాంటి పాడు పని చేసిన […]

కరోనా వైరస్ ని వ్యాపింపజేయాలట.. ఇన్ఫోసిస్ ఉద్యోగి నిర్వాకం.. అరెస్ట్
Follow us on

ఓ వైవు కోవిడ్-19 మహమ్మారితో దేశం నానా అగచాట్లూ పడుతుంటే కొందరికి ఇది ఓ వినోదంలా కనిపిస్తోంది. ఉదాహరణకు బెంగూరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఒకరు.. ఈ వ్యాధిని అడ్డుపెట్టుకుని అమాయక ప్రజలతో చెలగాటమాడుతున్నారు. ఇళ్లలో కాకుండా బయట వీధుల్లోకి వెళ్లి  తుమ్మాలని, కరోనా వైరస్ ని వ్యాపింపజేయాలంటూ ఇతగాడు తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. 25 ఏళ్ళ ఇతడ్ని ముజీబ్ మహ్మద్ గా గుర్తించారు. ఈ విపత్కర సమయంలో ఇలాంటి పాడు పని చేసిన ఈ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. ఇతని చర్య తమ సంస్థ నియమావళికి విరుధ్ధమని, ఇది కావాలనే అతడు చేసినట్టు కనిపిస్తోందని ఇన్ఫోసిస్ యాజమాన్యం పేర్కొంది. మా సంస్థలో పని చేసే ఇతని దుందుడుకు పని ఎంతయినా ఖండించదగినది.. అతని నిర్వాకం వల్ల మా సంస్థ ప్రతిష్ట దెబ్బ తింటోంది.. ఇతడిని సర్వీసు నుంచి తొలగించాం అని ఈ సంస్థ పేర్కొంది. ఇప్పటికే దేశంలో 800 కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  మృతుల సంఖ్య 18 కి పెరిగింది.అయితే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగాను, కేంద్రంతో బాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గట్టి నివారణ చర్యలు తీసుకుంటున్న ఫలితంగాను చాలావరకు మరణాలను నియంత్రించగలుగుతున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ముజీబ్ వంటి ఉద్యోగుల పట్ల ఆయా సంస్థల యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించాలని ఈ వర్గాలు కోరాయి.