‘ఇండియన్లూ ! కరోనా భయం వద్దు..’ ప్రపంచ ఆరోగ్య సంస్థ అభయం

కరోనాపై భారతీయులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఈ సంస్థకు చెందిన ప్రాంతీయ అత్యవసర సర్వీసుల విభాగం డైరెక్టర్ డాక్టర్ రోడ్రికో అఫ్రిన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే ఇందుకు కారణం.

ఇండియన్లూ ! కరోనా భయం వద్దు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అభయం

Edited By:

Updated on: Mar 05, 2020 | 1:03 PM

కరోనాపై భారతీయులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఈ సంస్థకు చెందిన ప్రాంతీయ అత్యవసర సర్వీసుల విభాగం డైరెక్టర్ డాక్టర్ రోడ్రికో అఫ్రిన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే ఇందుకు కారణం.. విదేశాలకు వెళ్లినవారికి అక్కడ ఈ వైరస్ సోకడమే అన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందువల్ల వైరస్ తగ్గుముఖం పడుతుందా అని ప్రశ్నించగా.. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

ఇది కొత్త వైరస్ అని, ఈ కారణంగా సమాచారం సేకరించేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రీసెర్చర్లు పరిశోధనలు చేస్తున్నారు. వారి రీసెర్చ్ ఫలితాలు త్వరలో తెలుస్తాయి అని రోడ్రికో చెప్పారు. ఇండియాలో కరోనా కేసులు 29 కి చేరుకున్నాయన్న విషయాన్ని ఆయన దృష్టికి తేగా.. ఏమైనప్పటికీ భయం అనవసరమన్నారు. అయితే శిక్షణ పొందిన డాక్టర్లు, నర్సుల అవసరం ఎంతయినా ఉందని, అలాగే ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులను అన్ని హంగులు , మందులతో సిధ్ధంగా ఉంచాలని ఆయన సూచించారు. అసలు కరోనా సోకకుండా తరచూ చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, దగ్గు, తుమ్ములు వఛ్చినపుడు  నోటికి అడ్డు పెట్టుకోవడం చేయాలనీ, మరీ అనుమానం వస్తే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.