Restoration of Passenger Special Trains: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇటీవల విలయతాండం చేసి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య తగ్గుతున్నా.. మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. అయితే.. కరోనా రవాణా శాఖపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే దేశంలో వందలాది రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి. సెకండ్ వేవ్ వల్ల ప్రయాణికులు లేకపోవడంతో.. నడుస్తున్న పలు రైళ్లను సైతం రద్దు చేశారు. తాజాగా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో భారతీయ రైల్వే రైళ్ల పున:రుద్ధరణకు పచ్చజెండా ఊపుతోంది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇంతకుముందు సస్పెండ్ చేసిన పలు రైలు సేవలను పునఃప్రారంభించనున్నట్లు భారీతీయ రైల్వే వెల్లడించింది.
వివిధ రూట్లల్లో ఇంతకు ముందు తాత్కాలికంగా రద్దు చేసిన అనేక ప్రత్యేక రైళ్ల సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు తూర్పు రైల్వే జోన్ శుక్రవారం ప్రకటించింది. పలు ప్యాసింజర్ ప్రత్యేక రైళ్ల సేవలు ఈ నెల 14 నుంచి తిరిగి ప్రారంభమవుతాయని.. సమయం యథాతథంగా ఉంటుందని జోనల్ రైల్వే పేర్కొంది. తూర్పు రైల్వే జోన్‌లో తిరిగి ప్రారంభం కానున్న ప్యాసింజర్ ప్రత్యేక రైళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
స్పెషల్ ట్రైన్స్ పునరుద్ధరణ తేదీలు..
రైలు నంబర్ 03401 భాగల్పూర్ – దానపూర్ స్పెషల్ జూన్ 14 నుంచి
03402 దానపూర్ – దానపూర్ స్పెషల్ 14 జూన్ నుంచి
03419 భాగల్పూర్ – ముజఫర్‌పూర్ స్పెషల్ 14 జూన్ నుంచి
03420 ముజఫర్ పూర్ – భాగల్ పూర్ స్పెషల్ 14 జూన్ నుంచి
03063 హౌరా – బలూర్ఘాట్ స్పెషల్ జూన్ 16 నుంచి
03064 బలూర్ఘాట్ – హౌరా స్పెషల్ స్పెషల్ 16 జూన్ నుంచి
03113 కోల్ కతా – లాల్‌గోలా స్పెషల్ 16 జూన్ నుంచి
03114 లాల్‌గోలా – కోల్ కతా స్పెషల్ 16 జూన్ నుంచి
03141 సీల్దా – న్యూ అలిపుర్దూర్ 16 జూన్ నుంిచ
03142 న్యూ అలిపుర్దూర్ – సీల్దా స్పెషల్ 17 జూన్ నుంచి
03145 కోల్ కతా – రాధికాపూర్ స్పెషల్ 16 జూన్ నుంచి
03146 రాధికాపూర్ – కోల్ కతా స్పెషల్ 17 జూన్ నుంచి
03163 సీల్దా – సహర్సా స్పెషల్ 16 జూన్ నుంచి
03164 సహర్సా – సీల్దా స్పెషల్ 17 జూన్ నుంచి
03169 సీల్దా – సహర్సా స్పెషల్ (పూర్ణియా) 17 జూన్ నుంచి
03170 సహర్సా – సీల్దా స్పెషల్ (పూర్ణియా) 18 జూన్ నుంచి
03181 కోల్‌కతా – సీల్‌ఘాట్ టౌన్ స్పెషల్ 21 జూన్ నుంచి
03182 సిల్ ఘాట్ టౌన్ – కోల్‌కతా స్పెషల్ 22 జూన్ నుంచి యథాతధంగా ప్రారంభమవుతాయని ఈస్టర్న్ రైల్వే జోన్ పేర్కొంది.
Also Read: