ఇండియాలో కరోనా.. అదే జోరు.. తగ్గని కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తాజాగా 14, 378 కి చేరుకున్నాయి. వీటిలో 11,906 యాక్టివ్ కేసులు.. 1991 మంది రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా కేసులు 991 కి పెరగగా.. 43 మంది మృతి చెందారు. శనివారం రీకవరీ రేటు పెరిగిందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 14 రోజుల్లో 47 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదన్నారు. మహారాష్ట్రలో కరోనా జోరు […]

ఇండియాలో కరోనా.. అదే జోరు.. తగ్గని కేసులు

Edited By:

Updated on: Apr 18, 2020 | 7:40 PM

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తాజాగా 14, 378 కి చేరుకున్నాయి. వీటిలో 11,906 యాక్టివ్ కేసులు.. 1991 మంది రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా కేసులు 991 కి పెరగగా.. 43 మంది మృతి చెందారు. శనివారం రీకవరీ రేటు పెరిగిందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 14 రోజుల్లో 47 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదన్నారు. మహారాష్ట్రలో కరోనా జోరు మరింత పెరిగింది. ఈ కేసులు 3, 202 కు చేరుకున్నాయి. రాష్ట్రంలో 286 కొత్త కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనే 177 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడుగురు మరణించారని, ఇప్పటివరకు  మొత్తం 194 మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

అటు-ప్రపంచ వ్యాప్తంగా 185 దేశాల్లో 2, 240,768 కన్ఫామ్ కేసులని వెల్లడైంది. లక్షా 53 వేల మందికి పైగా మృత్యుబాట పట్టారని తెలుస్తోంది.