India Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. . ఒక్కరోజులోనే 1,217 మంది వైరస్‌తో మృతి

Coronavirus: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 71,365 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ ధాటికి మరో 1,217 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్ష మందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

India Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. . ఒక్కరోజులోనే 1,217 మంది వైరస్‌తో మృతి
India Corona Cases

Updated on: Feb 09, 2022 | 10:49 AM

India Covid Deaths: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా చేసిన పరీక్షల్లో(Corona Tests)  71,365 మందికి మహమ్మారి సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4,24,10,976కి చేరింది.  ఒక్కరోజులోనే 1,217 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో దేశంలో కరోనా మృతుల(Corona Deaths) సంఖ్య 5,05,279కి పెరిగింది. కొత్తగా 1,72,211మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి.

  • దేశంలో మొత్తం కేసులు: 4,24,10,976
  • మొత్తం మరణాలు: 5,05,279
  • న యాక్టివ్ కేసులు: 8,92,828
  • మొత్తం కోలుకున్నవారు: 4,10,12,869‬

కాగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అదే స్పీడ్‌తో కొనసాగుతోంది.  దేశంలో కొత్తగా 53,61,099 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,70,87,06,705 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగానూ కరోనా ​కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 21 లక్షల మంది కరోనా బారినపడ్డారు. 11,785 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 57,81,546కు చేరింది. జర్మనీలో కొత్తగా 2,12,724 లక్షల మందికి వైరస్ బారినపడ్డారు.

Also Read: Rs 10 coins: ‘అసలు రూ.10 కాయిన్స్ చెల్లుబాటులో ఉన్నాయా.. లేదా..?’.. ఇదిగో ఫుల్ క్లారిటీ