భారత్‌లో రికార్డ్ స్థాయిలో నమోదైన కరోనా కేసులు.. వెయ్యి దాటిన మరణాలు.. అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం..

|

Apr 14, 2021 | 9:57 AM

Indian Corona Cases Updates: భారతదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పీక్స్‌లో ఉంది. కరోనా ప్రభావం దేశంలో ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారి..

భారత్‌లో రికార్డ్ స్థాయిలో నమోదైన కరోనా కేసులు.. వెయ్యి దాటిన మరణాలు.. అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం..
Follow us on

Indian Corona Cases Updates: భారతదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పీక్స్‌లో ఉంది. కరోనా ప్రభావం దేశంలో ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారి ఒక్క రోజులోనే భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,84,372 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 82,339 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇక 24 గంటల్లో కరోనా వైరస్ ప్రభావం 1,027 మంది ప్రాణాుల కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 13,65,704 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం నాడు కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,38,73,825 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,23,36,036 మంది కరోనాను జయించి సురక్షితంగా ఉన్నారు. కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,72,085 ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 11,11,79,578 వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు.

Also read:

Rohit Sharma: స్పిన్‌‌కు అనుకూలంగా పిచ్‌లు.. బ్యాటింగ్ పక్కన పెట్టి..బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న హిట్‌మ్యాన్

Telangana Corona: జీహెచ్‌ఎంసీలోనే అత్యధిక కరోనా కేసులు.. నిన్న రాష్ట్రంలో ఎన్ని నమోదయ్యాయో తెలుసా..?

Dr BR Ambedkar : ‘నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు, సర్వసమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు’