ఇండియా.. దాదాపు రెండు లక్షలకు చేరిన కరోనా వైరస్ కేసులు

ఇండియాలో కరోనా వైరస్ కేసులు సుమారు రెండు లక్షలకు చేరుకున్నాయి. లక్షా 98 వేల 706 కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 5,598 మంది రోగులు మృతి..

ఇండియా.. దాదాపు రెండు లక్షలకు చేరిన కరోనా వైరస్ కేసులు

Edited By:

Updated on: Jun 02, 2020 | 7:50 PM

ఇండియాలో కరోనా వైరస్ కేసులు సుమారు రెండు లక్షలకు చేరుకున్నాయి. లక్షా 98 వేల 706 కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 5,598 మంది రోగులు మృతి చెందగా.. 95,527 మంది కోలుకున్నట్టు ఈ శాఖ తెలిపింది. రీకవరీ రేటు కూడా 48.19 కి పెరిగింది. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us