Coronavirus: దేశంలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యధికంగా..

Coronavirus: దేశంలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
Follow us

|

Updated on: Mar 03, 2021 | 10:36 AM

India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలుచోట్ల లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. సోమవారం రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,56,20,749 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 14,989 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,39,516 (1.11కోట్లు) కు చేరింది. ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 98 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,57,346 కు చేరింది. కరోనా కేసులతో పోల్చుకుంటే.. నిన్న డిశ్చార్జ్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా నుంచి నిన్న 13,123 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,08,12,044 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,70,126 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.06 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.41 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,85,220 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి మార్చి 1వ తేదీ వరకు మొత్తం 21,84,03,277 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.

Also Read:

Rahul Gandhi:నాడు ఎమర్జెన్సీ విధింపు పొరబాటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒప్పుకోలు, కానీ, పార్టీ ‘డిజైన్’ మారలేదు

Covid-19 Vaccination Center in AP: కరోనా భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్.. మీ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా.. వివరాలు తెలుసా?