వాటినే కరోనా మరణాలుగా గుర్తించండి: ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాలు

| Edited By:

May 11, 2020 | 5:19 PM

కరోనా మరణాలపై ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా బారిన పడిన వారు నిమోనియా, గుండెపోటు, రక్తం గడ్డకట్టడం సహా మరికొన్ని ఇతర రోగాలకు దారితీసి చనిపోతేనే వాటిని కోవిడ్ 19 మరణాలుగా నమోదు చేయాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి ప్రభావం ఉందన్న ఐసీఎంఆర్.. ప్రజారోగ్యంపై కరోనా ప్రభావం తెలుసుకోవడానికి, ప్రణాళికలు అమలు చేయడానికి, సరైన సమయంలో జోక్యం చేసుకోవడానికి భారత్‌కు కచ్చితమైన సమాచారం అవసరమని వివరించింది. కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉండి […]

వాటినే కరోనా మరణాలుగా గుర్తించండి: ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాలు
Follow us on

కరోనా మరణాలపై ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా బారిన పడిన వారు నిమోనియా, గుండెపోటు, రక్తం గడ్డకట్టడం సహా మరికొన్ని ఇతర రోగాలకు దారితీసి చనిపోతేనే వాటిని కోవిడ్ 19 మరణాలుగా నమోదు చేయాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి ప్రభావం ఉందన్న ఐసీఎంఆర్.. ప్రజారోగ్యంపై కరోనా ప్రభావం తెలుసుకోవడానికి, ప్రణాళికలు అమలు చేయడానికి, సరైన సమయంలో జోక్యం చేసుకోవడానికి భారత్‌కు కచ్చితమైన సమాచారం అవసరమని వివరించింది.

కరోనా పరీక్షల ఫలితాలు రావాల్సి ఉండి లక్షణాలు కనిపిస్తే కరోనా అనుమానిత మృతిగా తీసుకోవాలని.. పరీక్షల్లో నెగిటివ్ వచ్చి లక్షణాలు కనిపిస్తే క్లినికల్లీ-ఎపిడెమిలాజికల్లీ కోవిడ్ 19 మరణంగా గుర్తించాలని స్పష్టం చేసింది. ప్రామాణికంగా మరణాలకు కారణాలు నమోదు చేస్తేనే వ్యాధి పరిస్థితి, మరణాల రేటు తెలుస్తుందని వివరించింది. దేశంలో కరోనా నివారణ చర్యలు, ప్రణాళికలు అమలు చేసేందుకు ప్రజలను కాపాడేందుకు ప్రతి రాష్ట్రం, జిల్లా నుంచి కచ్చితమైన సమచారం ఉండాలని ఐసీఎంఆర్ తెలిపింది.

Read This Story Also: జగద్గిరిగుట్టలో యువకుడి దారుణ హత్య.. నలుగురు వచ్చి..!