క‌రోనా క‌ష్ట‌కాలంలో కానిస్టేబుళ్ల క‌క్కుర్తి.. సస్పెన్షన్ వేటు

|

May 11, 2020 | 4:16 PM

హైద‌రాబాద్ అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌కు చెందిన ఇద్ద‌రు కానిస్టేబుళ్లు చేతివాటం ప్ర‌ద‌ర్శించారు.

క‌రోనా క‌ష్ట‌కాలంలో కానిస్టేబుళ్ల క‌క్కుర్తి.. సస్పెన్షన్ వేటు
Hyderabad Cop Says Marriage Proposal Rejected Over Job Timings, Quits
Follow us on

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవ‌లు యావ‌త్ ప్ర‌పంచం కీర్తిస్తోంది. ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కుండా ప్ర‌జ‌ల కోసం వారు ప‌డుతున్న శ్ర‌మ‌కు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఇందులో పోలీసుల పాత్ర కూడా అత్యంత కీల‌క‌మైన‌ది. రాత్రింబ‌వ‌ళ్లు రోడ్ల‌పై గ‌స్తీ కాస్తు..వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు  జ‌నాలు బ‌య‌ట‌కు రాకుండా, ఎక్క‌డా గుంపులుగా చేర‌కుండా ఉండేందుకు వారు ఎంత‌గానో శ్ర‌మిస్తున్నారు. అయితే, హైద‌రాబాద్‌లో మాత్రం ఓ ఇద్ద‌ర కానిస్టేబుళ్లు క‌క్కుర్తి చూపించారు. దీంతో వారిపై అధికారులు స‌స్సెన్ వేటు వేశారు. వివ‌రాల్లోకి వెళితే..

 

హైద‌రాబాద్ అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌కు చెందిన ఇద్ద‌రు కానిస్టేబుళ్లు చేతివాటం ప్ర‌ద‌ర్శించారు. డి.పంచ ముకేశ్‌, సురేశ్ అనే ఇద్ద‌రు కానిస్టేబుళ్లు ఎంజే మార్కుట్‌ పరిసరాల్లో ఓ పండ్ల వ్యాపారి ఆటోను ఆపి డబ్బులు వసూలు చేశారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్త వైరల్‌ అయింది.  ఈ ఘటనపై విచారణ చేపట్టి..ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశామని, సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేనందుకు అఫ్జల్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌కు చార్జీ మెమో జారీ చేసినట్లు సీపీ అంజనీకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.