Gandhi Hospital: మరోసారి కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ హాస్పిటల్స్.. రేపటి నుంచి పూర్తిస్థాయిలో కరోనా సేవలు

కరోనా వికృతరూపానికి తెలంగాణ విలవిలలాడుతోంది. ఇంతకాలం స్తబ్ధతగా ఉన్న కోవిడ్ మహమ్మారి మళ్లీ కోరలుచాస్తోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Gandhi Hospital: మరోసారి కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ హాస్పిటల్స్..  రేపటి నుంచి పూర్తిస్థాయిలో కరోనా సేవలు
Gandhi Hospital

Edited By:

Updated on: Apr 16, 2021 | 5:45 PM

Gandhi Hospital: కరోనా వికృతరూపానికి తెలంగాణ విలవిలలాడుతోంది. ఇంతకాలం స్తబ్ధతగా ఉన్న కోవిడ్ మహమ్మారి మళ్లీ కోరలుచాస్తోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆసుపత్రులను కోవిడ్ కేంద్రాలుగా మార్చేందుకు రెఢీ అయ్యింది. ఇందులో భాగంగా గాంధీ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ సేవలు నిలిపి వేశారు. గాంధీ ఆసుపత్రిని మరోసారి పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మార్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారి చేసింది. ఓపీ సేవలు నిలిపి వేసి కేవలం కోవిడ్ కేసులకు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా నిర్ణయించారు.

ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో 450 మందికి పైగా పేషంట్స్ వివిధ రకాల వ్యాధులకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ప్రతి పది నిమిషాలకు ఒకరు గాంధీ ఆసుపత్రిలో చేరుతున్నారు. నిన్న ఒక్క రోజే 150 మంది కరోనా పేషంట్లు చేరారు. కోవిడ్ పేషంట్లతో గాంధీ హాస్పిటల్ ఐపీ బ్లాక్ నిండిపోయింది. ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపి వేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏప్రిల్‌ 17 నుంచి గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

Gandhi Covid Hospital

ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిని రేపటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ సేవలను అందించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా రోగులు పెరుగుతుండటంతో నాన్‌ కోవిడ్‌ డిపార్ట్‌మెంట్స్‌ను వైద్యులు ఖాళీ చేయిస్తున్నారు.

Read Also…  CS meet CM KCR: మరికాసేపట్లో కేసీఆర్‌తో సీఎస్ సోమేశ్ కుమార్ కీలక భేటీ.. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలుపై చర్చ