
కరోనా లాక్‌డౌన్ కారణంగా.. వలస కూలీల కోసం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను ప్రారంభించి.. వేర్వేరు రాష్ట్రాలకు తరలిస్తుంది భారతీయ రైల్వే శాఖ. ఈ నేపథ్యంలో రైళ్లను ఎలా శుభ్రం చేస్తూ.. శానిటైజ్ చేస్తున్నారో తెలుపుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రతీ రైలును బయట, లోపల కూడా పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామనీ అలాగే ప్రయాణికులంతా ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేస్తున్నామని తెలిపింది. ఫేస్ మాస్క్ లేదా కర్చీఫ్ లాంటిది పెట్టుకున్న వారిని, ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే స్టేషన్‌లోకి అనుమతిస్తున్నామనీ.. అందరూ హ్యాండ్ శానిటైజ్ రాసుకునేలా.. చేస్తున్నామని వీడియోలో వివరించారు రైల్వే శాఖ అధికారులు.
ట్రైన్‌లో కోచ్‌లు చేతులు శుభ్రం చేసుకునే చోట.. ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం లిక్విడ్ హ్యాండ్ వాష్, శానిటైజర్లను ఉంచినట్లు రైల్వే తెలిపింది. టికెట్ కన్ఫామ్ అయిన పాసింజర్లను మాత్రమే స్టేషన్‌లోకి అనుమతిస్తున్నట్లు వివరించింది. ఫ్లాట్‌ఫామ్ దగ్గర, రైలు ఎక్కేటప్పుడు, సీట్లో కూర్చునేటప్పుడు.. అంతా భౌతిక దూరం కంపల్సరీ చేసినట్లు వీడియోలో చూపించింది రైల్వే శాఖ. కాగా రైల్వే శాఖ చేపట్టిన ఈ సేవలు చాలా బాగున్నాయని ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన సందర్భంగా.. భారతీయ రైల్వే శాఖ ఈ వీడియో రిలీజ్ చేసింది.
Indian Railways taking all necessary precautions like sanitization, social distancing, wearing face cover/masks etc in special trains.
Sanitization, thermal screening are being done in Secunderabad to New Delhi special train.#IndiaFightsCorona pic.twitter.com/DUo6IAzyj8
— Ministry of Railways (@RailMinIndia) May 23, 2020
Read More: