కరోనా మరణాలకు చెక్‌ పెడుతోన్న ‘విటమిన్ డి’

| Edited By:

Sep 08, 2020 | 5:39 PM

కరోనా కారణంగా ఐసీయూలో చేరిన వారి పాలిట విటమిన్‌ డి క్రియాశీల రూపమైన కాల్సిఫెడియోల్‌ వరంగా మారినట్లు

కరోనా మరణాలకు చెక్‌ పెడుతోన్న విటమిన్ డి
Follow us on

Vitamin D Corona deaths: కరోనా కారణంగా ఐసీయూలో చేరిన వారి పాలిట విటమిన్‌ డి క్రియాశీల రూపమైన కాల్సిఫెడియోల్‌ వరంగా మారినట్లు స్పెయిన్ పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్‌ డిను అధిక మోతాదులో రోగులకు ఇవ్వడం వలన ఐసీయూలో చికిత్స పొందే అవసరాన్ని తగ్గిస్తుందని వారు వెల్లడించారు. సైన్స్‌ డైరెక్ట్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. 76 మంది కరోనా బాధితుల్లో 50 మందికి కాల్సిపెడియోల్‌ ఇవ్వగా, వారిలో ఒకరికి మాత్రమే ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి ఎదురైందని తెలిపారు.

ఈ ఔషధాన్ని తీసుకొని వారిలో 13 మంది ఐసీయూలో చేరగా, ఇద్దరు మరణించారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. విటమిన్‌ డి.. ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులకు ఐసీయూ అవసరాన్ని తగ్గిస్తుందని పరిశోధకుల్లో ఒకరైన మార్టా ఎంట్రినాస్ కాస్టిలో తెలిపారు. ఈ ఔషధం కరోనా వ్యాధి తీవ్రతను తగ్గిస్తున్నప్పటికీ దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా విటమిన్‌ డి తక్కువ ఉన్న వారి మీద కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటోందని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన విషయం తెలిసిందే.

Read More:

కంగనా ఉందని మూవీ నుంచి తప్పుకున్నా: లెజండరీ సినిమాటోగ్రాఫర్‌

భారత్‌లో రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్!