మ‌ధ్య సీట్ల భ‌ర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌..! మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌నిస‌రి

|

Jun 15, 2020 | 5:47 PM

కరోనా నేప‌థ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఎయిర్‌ ఇండియా విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తున్న‌ విషయం విధిత‌మే. అయితే...వైరస్‌ నియంత్రణకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలను మాత్రం తప్పక పాటించాలని..

మ‌ధ్య సీట్ల భ‌ర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌..! మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌నిస‌రి
Follow us on

ప్ర‌పంచం క‌రోనా లాక్ డౌన్ నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో.. ఇక నుంచే అస‌లైన స‌వాల్ అని స్ప‌ష్టం అవుతోంది. ఓ వైపు దేశంలో వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతూ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. మ‌రోవైపు దేశంలోకి వ‌స్తున్న వ‌ల‌స కూలీలు, కార్మికుల ద్వారా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయ‌నే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇటువంటి త‌రుణంలో ముంబ‌యి హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. విమానాల్లో మధ్య సీట్లను విమానయాన సంస్థలు భర్తీ చేసుకోవచ్చని ముంబ‌యి హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

కరోనా నేప‌థ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఎయిర్‌ ఇండియా విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తున్న‌ విషయం విధిత‌మే. అయితే విమానాల్లో మధ్య సీట్లను కూడా భర్తీ చేస్తూ భౌతిక దూరం నిబంధనను ఆ సంస్థ ఉల్లంఘిస్తోందని, దీంతో ప్రయాణికులకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఎయిర్‌ ఇండియా పైలట్‌ దేవెన్ కనాని పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ముంబ‌యి హైకోర్టు ఈ మేర‌కు తీర్పు వెల్ల‌డించింది. విమానాల్లో మధ్య సీట్లను విమానయాన సంస్థలు భర్తీ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. అయితే కరోనా వైరస్‌ నియంత్రణకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలను మాత్రం తప్పక పాటించాలని పేర్కొంది. ఎయిర్‌ ఇండియా పైలట్‌ దేవెన్ కనాని తన పిటిషన్‌లో లేవనెత్తిన అభ్యంతరాలను న్యాయమూర్తులు ఎస్ జె కథవల్లా, ఎస్ పి తవాడేతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. మధ్య సీటును ఖాళీగా ఉంచకపోయినా ప్రయాణికుల రక్షణ కోసం విమానయాన సంస్థలు తగిన చర్యలు తీసుకోగలవని పేర్కొంది.

ఇదిలా ఉంటే, సోమ‌వారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం..దేశంలో గత 24 గంటల్లో 325 మరణాలు సంభవించగా.. కొత్తగా 11,502 కరోనా పాజిటివ్‌ కేసులు నవెూదు అయ్యాయి.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32, 424 కి చేరింది.. ప్రస్తుతం.. 1, 53,106 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,69,798 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు చేరారు.. తాజా మృతులతో కలుపుకొని.. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9, 520 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.