Health Minister Harsh Vardhan : దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఉందంటూ వస్తోన్న ఊహాగానాలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ స్పష్టతనిచ్చారు. హై లెవెల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో సమావేశం నిర్వహించిన వేళ హర్షవర్థన్ కోవిడ్ విషయమై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటి వరకూ 9కోట్ల 43లక్షలకు పైగా డోసులు ఇచ్చినట్లు ప్రకటించారు. గత 24 గంటల్లో 37లక్షలకు చేరువలో డోసులిచ్చినట్లు వెల్లడించారు. ఐతే గత వారం ఒక్కరోజులోనే 43లక్షలకు పైగా డోసులు వేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌లో మనమే ముందున్నట్లు ప్రకటించారు. వ్యాక్సిన్ల కొరత లేనే లేదని తేల్చిచెప్పారు. మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోందని ప్రకటించారు. కరోనా వైరస్ డెత్ రేటు దేశంలో 1.28 శాతంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం 0.46 శాతం క్రిటికల్ పేషెంట్స్ వెంటిలేటర్‌పై ఉన్నారని.. 2.31శాతం ఐసీయూలో ఉన్నారని తెలిపారు. 4.51 శాతం ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్‌పై ఉన్నారని వెల్లడించారు. 149 జిల్లాల్లో వారం రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రకటించారు. 8 జిల్లాల్లో 14 రోజులుగా ఒక్క కేసు కూడా రికార్డ్ అవలేదని హర్షవర్థన్ వెల్లడించారు. ఇక మూడు జిల్లాల్లో 21 రోజుల్లో కరోనా కేసులు వెలుగుచూడలేదని.. 63 జిల్లాల్లో 28 రోజుల్లో ఒక్కరు కూడా కరోనాబారిన పడలేదని వెల్లడించారు.
Read also : పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న చిన్నారులు, 10 ఫైర్ ఇంజన్లతో సహాయక చర్యలు