ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే.. జీహెచ్ఎంసీ కమిషనర్ సూచనలు

| Edited By:

May 19, 2020 | 5:17 PM

దేశ వ్యాప్తంగా నాలుగోసారి లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ 4.0లో మరికొన్నింటికి సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. బట్టల షాపులతో పాటుగా.. ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన షాపులకు కూడా ఓపెన్ చేసుకునేందుకు అనుమతులనిచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్.. కంటైన్మెంట్ జోన్‌లలో మినహా.. అన్ని చోట్ల అన్ని రకాల షాపులను తెరుచుకోవచ్చని ప్రకటించారు. అయితే లాక్‌డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కూడా దాదాపు రెండు నెలలుగా మూతపడ్డ […]

ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే.. జీహెచ్ఎంసీ కమిషనర్ సూచనలు
Follow us on

దేశ వ్యాప్తంగా నాలుగోసారి లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ 4.0లో మరికొన్నింటికి సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. బట్టల షాపులతో పాటుగా.. ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన షాపులకు కూడా ఓపెన్ చేసుకునేందుకు అనుమతులనిచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్.. కంటైన్మెంట్ జోన్‌లలో మినహా.. అన్ని చోట్ల అన్ని రకాల షాపులను తెరుచుకోవచ్చని ప్రకటించారు. అయితే లాక్‌డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కూడా దాదాపు రెండు నెలలుగా మూతపడ్డ షాపులన్ని తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ పలు సూచనలు చేశారు.

  • షాపుల‌లో ప‌నిచేస్తున్న వ్య‌క్తులంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల్సిందే
  • కొనుగోలుదారులు కూడా కచ్చితంగా మాస్కులు ధ‌రించి మాత్రమే షాపుల‌కు వెళ్లాలి
  • నోమాస్కు, నో గూడ్స్‌, నో స‌ర్వీస్ నిబంధ‌న‌ను క‌చ్చితంగా పాటించాలి
  • మాస్కు లేకుండా కనిపిస్తే.. రూ. 1000 ఫైన్
  • షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్  మార్కింగ్ చేయాలి
  • ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వ‌ద్ద హ్యాండ్ శానిటైజ‌ర్ ఏర్పాటు చేయాలి
  • వీలైన షాపుల్లో దాదాపు ఆటోమెటిక్ డోర్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలి

పై నిబంధనలన్నీ.. ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ స్పష్టం చేశారు.