కరోనాకి చెక్..ఇండియాలో వెల్లువెత్తిన పీపీఈ కిట్ల ఉత్పత్తి

| Edited By: Pardhasaradhi Peri

May 20, 2020 | 12:13 PM

దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటినుంచి ఈ రెండు నెలల్లో పీపీఈ కిట్ల ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. తాజాగా ఈ ఉత్పత్తి రోజుకు 4.5  లక్షలకు చేరుకున్నట్టు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. వీటి తయారీ కోసం 600 కంపెనీలకు సర్టిఫికెట్లు జారీ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. రెండు నెలలకు ముందు దేశంలో ఒక్క కిట్ కూడా తయారయ్యేది కాదని, వీటిని దిగుమతి చేసుకునేవారమని ఆమె అన్నారు. రెండు వారాల్లో ఈ కిట్ల తయారీ రెట్టింపు […]

కరోనాకి చెక్..ఇండియాలో వెల్లువెత్తిన పీపీఈ కిట్ల ఉత్పత్తి
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటినుంచి ఈ రెండు నెలల్లో పీపీఈ కిట్ల ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. తాజాగా ఈ ఉత్పత్తి రోజుకు 4.5  లక్షలకు చేరుకున్నట్టు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. వీటి తయారీ కోసం 600 కంపెనీలకు సర్టిఫికెట్లు జారీ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. రెండు నెలలకు ముందు దేశంలో ఒక్క కిట్ కూడా తయారయ్యేది కాదని, వీటిని దిగుమతి చేసుకునేవారమని ఆమె అన్నారు. రెండు వారాల్లో ఈ కిట్ల తయారీ రెట్టింపు అయిందన్నారు. ఈ నెల 5 న రోజుకు 2.06 లక్షల కిట్లు తయారయ్యేవి. ఇవాళ్టికి ఇది 4.5 లక్షలకు చేరినట్టు ఆమె వెల్లడించారు. ఈ కిట్స్ లో ఒక మాస్క్, ఐ షీల్డ్, షూ కవర్, గౌన్, గ్లోవ్స్ ఉంటాయి. సుమారు 15 రోజుల క్రితం వరకు దాదాపు 52 కంపెనీలు మాత్రమే వీటిని ఉత్పత్తి చేసేవి. 2.2 కోట్ల కిట్ల కోసం తాము ఆర్డర్ చేసినట్టు ఈ నెల మొదటివారంలో కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో 80 లక్షల కిట్లను దిగుమతి చేసుకుంటున్నట్టు పేర్కొంది.