నాలుగు రకాలైన కరోనా పరీక్షలు.. ఇందులో ఏది ఖచ్చితం?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉందో లేదో విస్తృతంగా పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపించినా వెంటనే ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేసుకోవాలని ప్రభుత్వాలు..

నాలుగు రకాలైన కరోనా పరీక్షలు.. ఇందులో ఏది ఖచ్చితం?

Edited By:

Updated on: Apr 13, 2020 | 9:16 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉందో లేదో విస్తృతంగా పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపించినా వెంటనే ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేసుకోవాలని ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. దీని వల్ల వ్యాధి ఇతరులకు వ్యాప్తి కాకుండా ఉంటుంది. అయితే వైరస్‌ ఉందో లేదో తెలుసుకోవాలంటే ప్రస్తుతం నాలుగు రకాల టెస్టులను నిర్వహిస్తున్నారు వైద్యులు.

ఆర్‌టీ-పీసీఆర్: ఇది కరోనా వైరస్‌ను ఖచ్చితంగా నిర్ధార్థించే పరీక్ష. ముక్కు లేదా నోటి నుంచి స్వాబ్ తీసుకుని పరీక్షిస్తారు. ఈ విధానంలో కణంలోని ఆర్‌ఎన్‌ఏని పరీక్షిస్తారు కాబట్టి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. పాజిటివ్ అని తేలితే, నిర్ధారణ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షకు రూ.5 వేల వరకూ ఖర్చవుతుంది. దీని ఫలితం రావాలంటే 5 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ పరీక్ష కిట్ల లభ్యత తక్కువగా ఉన్నాయి.

ట్రూనాట్: ఇది క్షయవ్యాధి నిర్థారణకు చేసే పరీక్ష. కరోనా నిర్థారణకు ట్రూనాట్ యంత్రాలు వినియోగించవచ్చని ఐసీఎంఆర్‌ సూచించింది. పీసీఆర్‌ కంటే దీనికి ఖర్చు తక్కువ. ఈ విధానంలో స్వాబ్‌లనే పరీక్షిస్తారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలితే.. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేసి నిర్ధారిస్తారు.

ర్యాపిడ్ యాంటీబాడీ: ఈ పరీక్షలో రక్తనమూనాలను పరీక్షిస్తారు. ఒక పరీక్షలకు రూ.700-800 వరకూ ఖర్చు అవుతుంది. 30-45 నిమిషాల్లో ఫలితం వచ్చేస్తుంది. ఇందులో పాజిటివ్ వస్తే ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేస్తారు. అందులో కూడా పాజిటివ్ అని తేలితే క్వారంటైన్‌కు తరలిస్తారు.

కెమిలూమినిసెన్స్: ఈ విధానంలో రక్త నమూనాలను పరీక్షిస్తారు. కిట్లు కొంతవరకూ మన దేశంలో దొరుకుతున్నాయి. విదేశాల నుంచి కొంటారు. మొత్తం ఐదు లక్షల కిట్లు కొనాలన్నది ఆలోచన.

ఇవి కూడా చదవండి:

రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జేసీ

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం

సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?