కరోనా నుంచి కోలుకున్న పసికందు

| Edited By:

Jun 13, 2020 | 8:28 AM

కోవిడ్‌-19 బారిన పడిన ఓ పసికందు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. 18 రోజులపాటు విమ్స్ లో చికిత్స పొందిన బాలుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకొని బయటపడ్డాడు.

కరోనా  నుంచి కోలుకున్న పసికందు
Follow us on

కోవిడ్‌-19 భారిన పడిన ఓ పసికందు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. 18 రోజులపాటు విమ్స్ లో చికిత్స పొందిన బాలుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకొని బయటపడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గిరిజన మహిళ లక్ష్మీ కరోనా వైరస్‌ భారిన పడింది. దీంతో వైద్యులు తన నాలుగు నెలల చిన్నారికి కూడా పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో చికిత్స నిమిత్తం మే 25వ తేదీన వైద్యులు పాపను విశాఖపట్నం వీఐఎంఎస్‌ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి 18 రోజులపాటు చికిత్సను అందించారు. కరోనా నుంచి చిన్నారి పూర్తిగా కోలుకుంది. ఇటీవలే పాపకు మరోమారు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది. అన్ని ఆరోగ్య పరీక్షల పూర్తి అనంతరం పాపను వైద్యులు ఆస్పత్రి నుంచి నిన్న సాయంత్రం డిశ్చార్జ్‌ చేశారు. కరోనా బారి నుంచి పసికందును కాపాడిన విమ్స్ వైద్యులకు కలెక్టర్ వినయ్ చందర్ అభినందనలు తెలిపారు.