స్వల్ప లక్షణాలైనా.. ఆరోగ్యంపై కరోనా దీర్ఘకాలికంగా ప్రభావం..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కరోనా సోకి స్వల్ప స్థాయిలో అనారోగ్యానికి గురైనప్పటికీ

  • Updated On - 2:10 pm, Fri, 9 October 20 Edited By:
స్వల్ప లక్షణాలైనా.. ఆరోగ్యంపై కరోనా దీర్ఘకాలికంగా ప్రభావం..!

Corona mild Symptoms: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కరోనా సోకి స్వల్ప స్థాయిలో అనారోగ్యానికి గురైనప్పటికీ.. ఆ లక్షణాలు నెలల తలబడి ఉంటున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. రోజులు గడుస్తున్న కొద్ది కొంతమందిలో అనారోగ్యం మరింత తీవ్రమవుతోందని ఆ అధ్యయనం తెలిపింది. క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ జర్నల్‌లో ఈ విషయాలను వెల్లడించారు.

మార్చి నుంచి జూన్ మధ్యలో స్వల్ప నుంచి మోస్తరు స్థాయి లక్షణాలు ఉన్న 150 మందిపై ఈ అధ్యయనం జరిపారు. రుచి, వాసన కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, జ్వరం, జలుబు సహా కరోనా లక్షణాల్లో ఏదో ఒకటి వీరిలో కనిపిస్తున్నట్లు గుర్తించారు. ఇందులో 66.66 శాతం మందిలో కరోనా నిర్ధారణ అయిన 60 రోజుల తరువాత కూడా లక్షణాలులేవని.. మిగిలిన 33.33 శాతం మందిలో తొలినాళ్లతో పోలిస్తే ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో లక్షణాలు దీర్ఘకాలం కొనసాగుతాయని అందులో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కూడా ఈ అధ్యయనంలో తేలింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని తమ పరిశోధనలో తేలినట్లు ఓ శాస్త్రవేత్త తెలిపారు. దీనిపై లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని వారు వెల్లడించారు.

Read More:

ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లిపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బాకీ వసూలు చేసుకొస్తానంటూ వెళ్లిన సినీ డిస్ట్రిబ్యూటర్ అదృశ్యం