తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు… టెన్షన్ పడిన ప్రజలు

|

Jun 23, 2020 | 4:14 PM

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. తాజాగా క‌ృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూమి కంపిస్తే.. మరోవైపు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో...

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు... టెన్షన్ పడిన ప్రజలు
Earthquake
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. తాజాగా క‌ృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ళ బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధాలు రావడంతో జనం ఆందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 2.2 గా నమోదైందని అధికారులు వెల్లడించారు.

ఇక తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చింతలపాలెం, మేళ్లచెరువులో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. సహజంగా భూమి లోపలి పొరల్లో కదలికలు వస్తూనే ఉంటాయనీ, ఆ కదలికల్లో తేడావచ్చినప్పుడు భూమి కంపిస్తుందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, మళ్లీ భూకంపం వచ్చే అవకాశాలు లేవని ధైర్యం చెప్పారు.