పోలీసుల డ్రెస్సులను వైరస్ రహిత చేయనున్న వినూత్న పరికరం

|

Jun 11, 2020 | 4:20 PM

కరోనాపై ముందువరుసలో ఉండి పోరాటం చేస్తున్న డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనాకు బలవుతున్నారు. అయితే వారిని రక్షించేందుకు ఓ పరికరాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసింది.

పోలీసుల డ్రెస్సులను వైరస్ రహిత చేయనున్న వినూత్న పరికరం
Follow us on

కరోనా వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు ప్రజలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తున్నారు. శానిటైజర్లతో చేతులను శుభ్రంగా కడుగుతున్నారు. ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాపై ముందువరుసలో ఉండి పోరాటం చేస్తున్న డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనాకు బలవుతున్నారు. అయితే వారిని రక్షించేందుకు ఓ పరికరాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసింది.

పోలీస్‌ యూనిఫాంలను కరోనా రహితం కానున్నాయి. పోలీస్‌ దుస్తులతోపాటు వారు ఉపయోగించే లాఠీలు, ఇతర వస్తువులపై ఉండే వైరస్‌ను నిర్మూలించే ఓ పరికరాన్ని డీఆర్డీవో తయారు చేసింది. ఓ చాంబర్‌ మాదిరిగా ఉండే ఇందులో ఉంచిన వస్తువులను పూర్తిగా శానిటైజ్ చేస్తుంది. ఢిల్లీ పోలీస్‌ శాఖ విన్నపం మేరకు డీఆర్డీవో దీన్ని రూపొందించింది.

కరోనాపై పోరాటంలో ముందున్నవారిలో పోలీసులు కూడా ఉన్నారు. ఇటీవల పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. రక్షణ దళాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది.