ఆల్కాహాల్‌తో ‘కరోనా’కు చెక్ పెట్టొచ్చా?

| Edited By:

Mar 03, 2020 | 5:59 PM

కరోనా వైరస్ రాకుండా చూసేందుకు పలు జాగ్రత్తలు తీసుకువాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చేతులను సుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. అందులోనూ.. ఆల్కహాల్ కలిగిన హ్యాండ్ శానిటైజర్లను వాడాలని..

ఆల్కాహాల్‌తో కరోనాకు చెక్ పెట్టొచ్చా?
Follow us on

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. ఇప్పటి వరకు ఈ భూతం 64దేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా 90వేల931 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3వేల125మంది చనిపోయారు.ఇక చైనా తర్వాత ఎక్కువగా కరోనా ప్రభావమున్న దేశం… సౌత్ కొరియా.. ఇప్పటి వరకు కొరియాలో 5వేల 289 కేసులు నమోదవ్వగా… 40మంది చనిపోయారు. ఇటలీ-ఇరాన్‌లో కరోనా ప్రభావంతో దాదాపు 100మంగికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. ఇప్పుడు మన గడపలోనూ కరోనా కంగారు మొదలైంది. తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం కరోనా బాధితుడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అటువైపు ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

అయితే.. కరోనా వైరస్ రాకుండా చూసేందుకు పలు జాగ్రత్తలు తీసుకువాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చేతులను సుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. అందులోనూ.. ఆల్కహాల్ కలిగిన హ్యాండ్ శానిటైజర్లను వాడాలని వారు చెబుతున్నారు. అయితే ఆల్కహాల్ నిజంగానే కరోనా వైరస్‌ను నాశనం చేస్తుందా? అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వచ్చిన వాళ్లు ఆల్కహాల్‌తో చేతులను శుభ్రం చేసుకున్నా.. ఆ వైరస్ నాశనం కాదు. కానీ ఇతరులకు రాకుండా చూసుకోవచ్చు. ఇక కరోనా వైరస్ రాని వారు చేతులను ఆల్కహాల్ కలిగిన హ్యాండ్ శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటే ఆ వైరస్ నాశనమవుతుంది. అయితే ఆల్కహాల్ సేవిస్తే.. కరోనా వైరస్ నాశనమవుతుందనే వార్తల్లో నిజం లేదని పరిశోధకులు చెబుతున్నారు.