Breaking news: హైదరాబాద్‌లో కరోనాతో డాక్టర్ మృతి

తెలంగాణలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూ...పరిస్థితి భయానకంగా మారుతోంది. కోవిడ్ కారణంగా నగరంలో ఓ డాక్టర్ మృత్యువాత పడ్డారు.

Breaking news: హైదరాబాద్‌లో కరోనాతో డాక్టర్ మృతి

Updated on: Jun 22, 2020 | 1:09 PM

తెలంగాణలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూ…పరిస్థితి భయానకంగా మారుతోంది. సామాన్యులనే కాదు, వైద్య సిబ్బందినీ కరోనా వదలడం లేదు. ఇప్పటికే పలువురు వైద్య సిబ్బందికి కరోనా సోకగా, తాజాగా కరోనాతో ఖైరతాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ చనిపోయాడు.

నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ అనారోగ్యం కారణంగా ఈ నెల 16న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 18న డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆదివారం (జూన్21న) రాత్రి చికిత్స పొందుతూ డాక్టర్ ప్రాణాలు విడిచారు. నాలుగు దశాబ్ధాలుగా ఖైరతాబాద్‌లో డాక్టర్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. మృతిచెందిన డాక్టర్ పేరు జ్ఞానేశ్వ‌ర్‌‌గా తెలుస్తోంది.