కరోనాకు విరుగుడు ‘ప్రాణాయామం’.. కోలుకున్న రోగి సలహా

కరోనా నుంచి కోలుకోవాలంటే యోగాలోని ప్రాణాయామం చాలా ఉత్తమమని అంటున్నారు ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న ఓ వ్యాపారి. ఈ వ్యాధి బారిన పడి ఢిల్లీలో మొదటిసారిగా  కోలుకున్న ఈయన పేరు రోహిత్ దత్తా

కరోనాకు విరుగుడు ప్రాణాయామం.. కోలుకున్న రోగి సలహా

Edited By:

Updated on: Apr 23, 2020 | 6:30 PM

కరోనా నుంచి కోలుకోవాలంటే యోగాలోని ప్రాణాయామం చాలా ఉత్తమమని అంటున్నారు ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న ఓ వ్యాపారి. ఈ వ్యాధి బారిన పడి ఢిల్లీలో మొదటిసారిగా  కోలుకున్న ఈయన పేరు రోహిత్ దత్తా.. 45 ఏళ్ళ ఈయన.. యోగాలో శ్వాసను నియంత్రించే ప్రాణాయామం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని, చికిత్సలో తనకిది ఎంతో తోడ్పడిందని తెలిపారు. కరోనా రోగులకు తానిదే సలహా ఇస్తున్నానని, వారు కూడా ప్రాణాయామం చేయడం మంచిదని ఆయన చెప్పారు. రీకవరీకి ఇది దోహదపడుతుందని, యాంగ్జయిటీని  తగ్గిస్తుందన్నారు.  గత ఫిబ్రవరి 24 న యూరప్ దేశాల నుంచి ఢిల్లీ చేరుకున్న రోహిత్ దత్తా.. స్వల్ప జ్వరం రావడంతో.. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని చెప్పారని, తనను క్వారంటైన్ కి తరలించారని అయన చెప్పారు. చికిత్స తీసుకుంటూనే.. ప్రాణాయామం చేస్తూ వచ్చానని, దీనివల్ల త్వరగా కోలుకోగలిగానని వెల్లడించారు.